దుమ్ము రేపుతున్న విక్రమ్ కొత్త సినిమా టీజర్

Kadaram Kondan, Chiyaan Vikram’s new thriller with director Rajesh M Selva.
Kadaram Kondan, Chiyaan Vikram’s new thriller with director Rajesh M Selva.

గతంలో తమిళ్ స్టార్ హీరోగా వెలుగొందిన విక్రమ్ అపరిచితుడు సినిమాతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు.కానీ ఆ తరువాత వరుసగా ఫ్లాప్స్ పలకరించడం,డిజాస్టర్స్ దరిచేరడంతో మినిమమ్ రేంజ్ హిట్ కూడా లేక ఇబ్బందిపడుతున్నాడు.ప్రాణాలకి తెగించి,పూర్తి డెడికేషన్ తో చేసిన ఐ సినిమా విక్రమ్ కెరీర్ ని శాసించింది.

అయితే విక్రమ్ ఇప్పుడు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కదరం కొండన్ అనే సినిమా చేసాడు.ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.దీనికి భారీ రెస్పాన్స్ వస్తుంది.డోంట్ బ్రీత్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి విక్రమ్ లుక్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.కమల్ హాసన్ నటించిన చీకటి రాజ్యం సినిమా ని డైరెక్ట్ చేసిన రాజేష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.కమల్ కూతురు అయిన అక్షర హాసన్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది.

స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా  భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈ వేసవిలో ప్రేక్షకులముందుకు రాబోతుంది.ఈ సినిమా హిట్ అయితే విక్రమ్ మళ్ళీ ట్రాక్ ఎక్కేసినట్టే.