మెగా బ్ర‌ద‌ర్స్‌పై పోటీకి దిగుతున్న కేఏ పాల్

KA Paul
KA Paul

మెగా బ్ర‌ద‌ర్స్‌పై పోటీకి దిగుతున్నారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ . ఎన్నికల్లో ఆయ‌న నరసాపురం లోక్ సభ, భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నానని పాల్ ప్ర‌క‌టించారు. దీని కోసం శుక్ర‌వారం లక్షల మంది మద్దతుదారులతో కలసి నామినేషన్ దాఖలు చేయ‌డానికి ఆయ‌న ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే.. ఏపీని అమెరికాగా మార్చేస్తానని ఇప్ప‌టికే ప్రజాశాంతి కేఏ పాల్ ప్ర‌చారం చేస్తున్నారు. అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీకి చెందిన హెలికాప్టర్ గుర్తుకు ఓటేయాలని ఆయ‌న కోరుతున్నారు. ప్ర‌త్య‌ర్ధి పార్టీల అధినేత‌లు చంద్రబాబు , జ‌గ‌న్ , ప‌వ‌న్ రోజూ హెలికాప్టర్ లో తిరిగి ప్ర‌చారం సాగిస‌త్ఉన్నార‌ని, కానీ తన దగ్గర మాత్రం హెలికాప్టర్ లో తిరిగేందుకు డబ్బులు కూడా లేవన్నారు. ఈ ముగ్గురు అధినేతలు హెలికాప్టర్ లో తిరుగుతూ ప్రజాశాంతి పార్టీని ప్రమోట్ చేస్తున్నారని వివ‌రించారు కే ఏ పాల్ .