టీడీపీ నిజమైన వారసుడు అతడే:వర్మ

ram-gopal-varma
ram-gopal-varma

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ చిత్రంపై మొదటి నుంచి ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో చంద్రబాబు ను విమర్శిస్తూ తీస్తున్నారని టీడీపీ శ్రేణులు కోర్టు మెట్లు ఎక్కారు. ఏపిలో తప్ప ఈ చిత్రం అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది.అయితే రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మద్య తన ట్విట్లతో ఎన్నో సంచలనాలు రేపుతున్న రాంగోపాల్ వర్మ తాజాగా మరో ట్వీట్ తో సంచలనం రేపారు.

సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ విజ్ఞప్తి అంటూ ట్వీట్ చేసిన వర్మ- లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్రను చూసిన తర్వాతే నిజాయతీపరులైన, అసలైన ఎన్టీఆర్ అభిమానులంతా ఓటు వేయాలని కోరారు. అంతే కాదు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న నారా లోకేష్ వారసుడు కానేకాదని, టిడిపి అసలైన వారసుడు  తారక్ మాత్రమే అని  పేర్కొన్నారు. అతడితోనే టీడీపీకి భవిష్యత్తు అని స్పష్టం చేశారు.