టిడిపి కాంగ్రెస్ తో క‌ల‌వ‌డం ఎన్టీఆర్ కు రెండ‌వ – ప్ర‌ధాని

Narendra Modi
Narendra

వేదిక ఏదైనా అటు ప్ర‌ధాని మోదీ.. ఇటు ఏపి సిఎం చంద్ర‌బాబుల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతూనే వుంది. సిఎం చంద్ర‌బాబు ఎప్పుడైతే కేంద్రంలోని బిజేపికి క‌టీఫ్ చెప్పారో అప్ప‌టి నుంచి ఈ రెండు పార్టీల మ‌ధ్య శ‌త్రుత్వం పెరుగుతూనే వ‌చ్చింది. అది పార్టీ శ్రేణుల‌ను సైతం తాకింది. ప్ర‌తి వేదిక‌లోనూ ఇరువురు నేత‌లు ఒకొరిని ఒక‌రు ఆడిపోసుకుంటున్నారు. ఒక‌రి వైఫ‌ల్యాల‌ను ఒక‌రు ఎండ‌గ‌ట్టుకుంటున్నారు. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన బూత్ స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోమారు నిప్పులు చెరిగారు. కుమారుడు లోకేశ్ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తును నాశ‌నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కుమారుడి అభివృద్ధి కోసం తప్ప ప్రజల అభివృద్ది కోసం పనిచేయడం లేదని ఆరోపించారు. మారుడి కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టిన చంద్రబాబు, మిగతా వారిని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు తెలుగు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అన్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా ఎన్టీఆర్‌కు చంద్రబాబు రెండోసారి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.