జెర్సీ లో అర్జున్ అదుర్స్

వరుసగా రెగ్యులర్ సినిమాలు చేసి చివరికి కృష్ణార్జున యుద్ధం తో పరాజయం పాలయిన నాని కొత్తగా ట్రై చెయ్యాలని ఆగి అలోచించి చేస్తున్న ప్రయోగం జెర్సీ.ఈ సినిమాపై నాని సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.జెర్సీ లో అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో కనిపించబోతున్నాడు నాని.

ఈ ఫస్ట్ లుక్ లో కాస్త హెయిర్ అండ్ గడ్డం పెంచి రఫ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.ఒక క్రికెట్ గ్రౌండ్ లో ఎలాంటి కోలాహలం ఉంటుందో ఈ పిక్ లో కూడా అదే వాతావరణం రిఫ్లెక్ట్ అయ్యింది.ఇక ఇది పీరియాడిక్ సినిమాగా రూపొందుతుండడం మరొక విశేషం.ఈ సినిమాలని సితార ఎంటెర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

ఈ సినిమా కథ నచ్చడంతో నాని రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకోవడానికి ఒప్పుకున్నాడు అనే టాక్ వచ్చింది.గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న ఈ సినిమా పై ఉన్న అంచనాలను ఈ లుక్ పెంచింది అనడంలో మాత్రం నో డౌట్.