కిర్రాక్ అనిపిస్తున్న నాని న్యూ లుక్

Jersey
Jersey

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ఎమోషనల్ ఎంటెర్టైనెర్ జెర్సీ.ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నట్టు కనిపిస్తున్నా కూడా ఎమోషన్స్ కీ ఫ్యాక్టర్ గా ఉండబోతున్నాయి.తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ మాత్రమే కాదు హీరో,హీరోయిన్స్ మధ్య క్యూట్ లవ్ స్టోరీ కూడా సబ్జెక్టు లో ఇమిడిపోయేలా డిజైన్ చేసాడు డైరెక్టర్. దాని ప్రకారం ఈ సినిమాలో నాని యంగ్ ఏజ్ లో ఉండే  గెట్ అప్ ని రివీల్ చేశారు.

ఈ సినిమాలో ”అదేంటోగాని ఉన్నపాటుగా…” అంటూ సాగే ఫస్ట్ లిరికల్ ని వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేస్తున్నారు.ఈ విషయం కన్వే చేస్తూ ఆ పోస్టర్ రిలీజ్ చేసారు.శ్రద్దా శ్రీనాథ్ తో నాని పెయిరింగ్ కూడా బావుంది.ఈ సినిమాలో నాని పాత్ర మొత్తం మూడు ఏజ్ గ్రూప్స్ లో కనిపించబోతుంది.ఇప్పటివరకు రెండు షేడ్స్ రిలీజ్ చేసారు. నాని చిన్నప్పటి పాత్ర మాత్రం వేరే వాళ్ళతో చేయించారు.ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండడంతో ఈ సినిమా ఆడియో పై సైతం మంచి అంచనాలున్నాయి.ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటే మాత్రం సినిమాపై హోప్స్ పెరగడం ఖాయం. సో,ఈ సారి అనిరుధ్ మ్యాజిక్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.