జేడి లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన…!

Lakshmi-Narayana
Lakshmi-Narayana

విశాఖ జనసేన ఎంపి అభ్యర్థి వీవీ(జేడి) లక్ష్మీనారాయణ ఓ సంచలన ప్రకటన చేశారు. ఆయన బుధవారం నిర్వహిచిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు విశాఖపట్టణానికి మేనిఫెస్టో తాను బాండ్ పేపర్ మీద ఇవ్వబోతున్నానని.. వాటిని చేయకుంటే తనను కోర్టుకు లాగొచ్చని.. ఆ దమ్ము తమ పార్టీకి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

జనసేన ఆవిర్భావానికి ముందే పవన్‌ కల్యాణ్‌తో తాను చర్చించానని.. ఆ తర్వాత తాను మహారాష్ట్ర వెళ్లడం, ఆయన పార్టీ పెట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయన్నారు. కలాం స్ఫూర్తితో, యువతను ఓ మార్గంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందన్న ఆలోచనతోనే జనసేనలో చేరానన్నారు.