శ్రీదేవి కూతురా మజాకా?

janhvi Kapoor
janhvi Kapoor

శ్రీదేవి కూతురుగా దఢక్ సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ ఆ సినిమాతో డీసెంట్ విక్టరీ అందుకుంది.బాలీవుడ్ లోజాన్వీ కి గాడ్ ఫాదర్ లా మారి ఆమె కెరీర్ బిల్డ్ చేస్తున్న కరణ్ జోహార్ బ్యానర్ లోనే సెకండ్ సినిమా తక్త్ కూడా చేస్తుంది.కానీ మూడో సినిమాకి మాత్రం చాలా సాహసం చేస్తుంది జాన్వీ.ఫస్ట్ ఇండియన్ లేడీ హెలికాప్టర్ పైలట్ అయిన గుంజన్ సక్సేనా బయోపిక్ లో జాన్వీ నటించబోతుంది.

కెరీర్ లో మూడో సినిమాకే ఇలాంటి సినిమా ఓకే చెయ్యడం చాలా డేరింగ్ స్టెప్ అనుకుంటే ఆ పాత్ర కోసం ఏడుకిలోలు బరువుపెరగడం అనేది ఇంకో డాషింగ్ డెసిషన్.ఎందుకంటే జనరల్ గా ఇలాంటి సినిమాలు చేసిన వాళ్లకు ఆ సినిమా వరకు సక్సెస్ అండ్ విక్టరీ వచ్చినా ఆ తరువాత మాత్రం అవకాశాలు పెద్దగా ఉండవు.ఇంతకుముందు సోనమ్ కపూర్ తో పాటు అనేకమంది హీరోయిన్స్ విషయంలో ఇదే జరిగింది.

పైగా బాలీవుడ్ హీరోయిన్స్ ఎంత స్లిమ్ గా ఉంటే అంత లాంగ్ కెరీర్ ఉంటుంది.ఇవన్నీ తెలిసి కూడా జాన్వీ ఈ నిర్ణయం తీసుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు చాలామంది.అయితే కరణ్ జోహార్ ఆదేశాలమేరకు ఈ సినిమా ఓకే చేసిన జాన్వీ మాత్రం ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ సినిమా చేసేందుకు ప్రిపేర్ అవుతుంది.శ్రీదేవిలా అన్ని రకాల పాత్రలు పోషించాలనేది జాన్వీ ఎయిమ్ అయిఉండొచ్చు.