రిప‌బ్టిక్ డే నాడు జ‌న‌సేనాని ఎక్క‌డో తెలుసా..!

Janasena Chief Pawan Kalyan
Janasena Chief Pawan Kalyan

విశాఖలోని రుషికొండలో జనసేన, వామపక్షాల రౌండ్ టేబుల్‌ స‌మావేశం జ‌రిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వామపక్షాల నేతలు రాఘవులు, మధు, రామకృష్ణల‌తో సమావేశమయ్యారు. జనసేన మౌలిక సిద్ధాంతాలు, వామపక్ష సిద్థాంతాలతో సారూప్యత, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పొత్తు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన శ్రేణులతో మమేకమవుతున్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 26, 27 తేదీలలో గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.

26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న జనసేన పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు . 27వ తేదీ మధ్యాహ్నం గుంటూరులోని ఇన్నర్‌ రింగురోడ్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత ఎల్‌ఇఎమ్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహహిరంగసభలో పవన్ కళ్యాణ్‌ పాల్గొంటారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం గుంటూరు జిల్లా జనసేన పార్టీ శ్రేణులు సభాప్రాంగణం వరకు పెద్ద ఎత్తున ర్యాలీతో పాల్గొంటారు.