ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఖాయం

Pawan Kalyan At Kurnool
Pawan Kalyan At Kurnool

జనమే జనసేన బలమన్నారు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ . యువత అంతా జనసేన వైపే ఉందన్నారు ఆయ‌న‌. అభ్యర్థుల గెలుపులో యువతదే కీలక పాత్ర వ‌హిస్తుంద‌న్నారు . కృష్ణా జిల్లా నూజివీడులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పవన్‌ పాల్గొని ప్రసంగించారు. చిత్తశుద్ధితో పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు ప‌వ‌న్‌. మీరు కోరుకున్న వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడని ధీమా వ్య‌క్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఖాయమని జొస్యం చెప్పారు.

నూజివీడును స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ప‌వ‌న్‌. త‌మ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యా పథకం అమలు చేస్తామన్నారు. విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌, భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రిని పునరుద్ధరిస్తామని అభ‌యం ఇచ్చారు ప్ర‌జ‌ల‌కు ఆయ‌న‌.