మంగ‌ళ‌గిరిలో పోటీకి సిద్ద‌మైన జ‌న‌సేన

PawanKalyan, Janasena, visakhapatnam, Guntur, Partyoffice,
Janasena Party

గుంటూరు జిల్లా మంగళగిరి స్థానంలోనూ సీపీఐకి జనసేన పార్టీ ఝలక్‌ ఇచ్చింది. సీపీఐ తరఫున ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్‌ వేసేందుకు రెఢీ అయ్యారు. అయితే నామినేషన్ల దాఖలుకు తుది రోజున చల్లపల్లి శ్రీనివాస్ అభ్య‌ర్ధిత్వాన్ని జనసేన ప్రకటిస్తూ బీ-ఫారాన్ని అందజేసింది. దీంతో ఆయ‌న కూడా నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు.

స్థానికంగా ఉన్న జనసేన నేతలను సంతృప్తి పరిచేందుకు, పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు జనసేన అధినేత పవన్‌ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నార‌ని స‌మాచారం. అయితే జనసేన నిర్ణయం పట్ల సీపీఐ నాయ‌కులు అసంతృప్తి వ్యక్తం చేస్తొన్నారు.

ఇప్పటికే మంగ‌ళ‌గిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున లోకేశ్‌, వైసిపి తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో వున్నారు. దీంతో మంగళగిరిలో పార్టీల మ‌ధ్య పోటీ రసవత్తరంగా మారింది.