జ‌న‌సేన ఆఫీసుల‌కు ఢోకా లేదు

Pawan Kalyan
Pawan Kalyan

జనసేన శ్రేణుల్లో నెల‌కొన్న గందరగోళంకి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు . నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. జనసేన పార్టీ ఆఫీసులు మూసివేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవ‌డంపై జ‌న‌సేనాని స్ప‌ష్ట‌త‌నిచ్చారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఇది ఆరంభం మాత్రమేననీ, జనసేన శ్రేణులంతా సమాజంలో మంచి మార్పు రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు . క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.