క‌డ‌ప గ‌డ‌ప‌లో ప‌వ‌న్ బ‌ల‌మైన సంక‌ల్పం

Pawan Kalyan Kadapa
Pawan Kalyan Kadapa

చాలా బలమైన సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . సమాజంలో మార్పునకు జనసైనికులు నాంది పలకాలన్నారు. కడప జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా జనసేన క్యాడర్ తో ఆయ‌న సమావేశమయ్యారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు .

రాయలసీమకు కొన్ని కుటుంబాలు చెడ్డపేరు తీసుకువచ్చాయన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఎంత చైతన్యముందో త‌న‌కు తెలుస‌న్నారు ఆయ‌న‌. రాయలసీమలో కుల ప్రభావం లేద‌ని అయితే కుటుంబాల ఆధిపత్యం ఉందన్నారు. ఒక్క‌ ఎన్నిక‌ల‌ కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ఒక తరాన్ని మార్చడం కోసం రాజకీయల్లోకి వచ్చానన్నారు ప‌వ‌న్‌.