కారెక్కేందుకు జ‌గ్గారెడ్డి సైతం ..?

k_jagga_reddy
k_jagga_reddy

తెలంగాణ‌లో రోజుకో ఎమ్మెల్యే .. ఏ జిల్లా అని కాదు.. కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తోంది. ఎన్నిక‌ల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు ఎమ్మెల్యేల వ‌ల‌స ప్ర‌ధాన గండంగా మారింది. ఏ రోజు ఎవ‌రు కారెక్కుతారోన‌నేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా గా వ‌ల‌స‌ల చిట్టాలోకి సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి వ‌చ్చారు. సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆ పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో తన అనుచరులు, సన్నిహితులతో జగ్గారెడ్డి సమావేశమైనట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో టీఆర్ఎస్ లో ఆయన చేరతారన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఇలా వ‌రుస‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి ఆర్ ఎస్ లోకి జంప్ కావ‌డం ఆ పార్టీ సీనియ‌ర్‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.