బాలకృష్ణ సినిమాలో మరోసారి విలన్ గా జగపతిబాబు…!

Jagapathi Babu
Jagapathi Babu

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరో అనగానే గుర్తుకు వచ్చేది జగపతి బాబు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన జగపతి బాబు కి పెద్దగా విజయాలు వరించలేదు. ఒకానొక దశలో ఆయన కెరీర్ కష్టాల్లో పడింది..ఇక సినిమాలకు దూరమైతాడేమో అన్న సమయంలో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు జగపతి బాబు.అప్పటి వరకు హీరోగా ఉహించుకున్న ఆయనను తెలుగు ప్రేక్షకులు విలన్ గా చూస్తారా అన్న అనుమానాలు ఉన్నా లెజెండ్ సినిమాలో తన విశ్వరూపాన్ని చూపించాడు జగపతిబాబు. అంతే అప్పటి వరకు హీరోగా ఉన్న ఇమేజ్ కన్నా విలన్ గా నటించిన తర్వాత ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. అప్పటి నుంచి తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతిబాబు.అయితే మరోసారి అయన బాలకృష్ణ సినిమాలో విలన్ రోల్ లో కనిపించనున్నారు. తాజాగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రతినాయకుడి పాత్ర కోసం జగపతిబాబును ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది.