జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు భారీగా ఫినిషింగ్ ట‌చ్

Jaganmohan_Reddy

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జ‌గ‌న్ చేపట్టిన పాదయాత్ర ఇవాళ్టితో ముగియనుంది.341 రోజుల పాటు ఏకధాటిగా 3,648 కిలోమీటర్ల పొడవునా ప్ర‌జా సంక‌ల్ప‌ పాదయాత్ర నిర్వహించారు. 2017 నవంబర్‌ 6న వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఇడుపులపాయలో శ్రీకారం చుట్టిన ఈ పాదయాత్రను 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు నిరాటంకంగా కొనసాగించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాటం చేయాల్సిన జగన్‌, అసెంబ్లిలో చర్చించి ప్రయోజనం లేదనుకున్నారు. నేరుగా ప్రజాక్షేత్రంలోకడుగెట్టాలని నిర్ణయించారు. సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్రలో జగన్‌ 2516 గ్రామాల్ని సందర్శించారు.

231 మండల కేంద్రాలు, 51 పురపాలక సంఘాలు, 8 నగరపాలక సంస్థల మీదుగా ఈ పాదయాత్ర సాగింది. ప్రతిరోజు ఆయన నేరుగా 50 నుంచి 70 వేల మంది వరకు ప్రజల్ని కలుసుకునేవారు. ఇంతవరకు 123 సభల్లో ప్రసంగించగా.. ఇవాళ‌ సభ 124వ సభను ఇచ్చాపురంలో నిర్వహిస్తున్నారు . ఈ పాద‌యాత్ర దారి పొడవునా జగన్‌ చూసేందుకు యువత, మహిళలు పోటీలుపడ్డారు. కాగా ఈసారి పాదయాత్రలో సెల్ఫీలు ప్రత్యేక ఆకర్షణగా నిల్చాయి. పాదయాత్రలోజ‌గ‌న్ వ్యవహరించిన తీరు అడుగడుగునా తండ్రి వైఎస్‌ను గుర్తుకు తెచ్చింది.గ‌తంలో 2003లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ పాదయాత్రకు నాంది పలికారు.

అనంతరం జరిగిన ఎన్నికల్లో పదేళ్ళ తెలుగుదేశం పాలనకు గండికొట్టి అధికారంలోకొచ్చారు. 2012అక్టోబర్‌ 3నుంచి చంద్రబాబు పాదయాత్ర చేశారు అనంతరం రాష్ట్ర విభజన వంటి సమస్యలు తలెత్తినా చంద్రబాబు సునాయాశంగానే అధికారంలోకి వ‌చ్చారు. ఈసారి జగన్‌ అంతకుమించిన సుదీర్ఘయాత్ర తలపెట్టారు . వైఎస్‌ రాజశేఖరరెడ్డి 50వ సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తే…చంద్రబాబు 60 ఏళ్ళుదాటిన అనంతరం పాదయాత్ర నిర్వహించారు. కాగా 50ఏళ్ళ లోపు వయసులోనే జగన్‌ పాదయాత్ర నిర్వహించి త‌న పొలిటికల్ మైలేజ్ కు బాట‌లు వేసుకున్నారు.