జగన్ కేసు పై విచార‌ణ‌.. ఎక్కడ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ?

jagan, Case, YCP, Congress, Tdp, Bjp,

జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ 6 రోజుల విచారణలో NIA కు ఒకే సమాధానమిచ్చాడు. జగన్ పై దాడి చేస్తే ఎన్నికల్లో సిఎం అవుతాడన్న ఉద్దేశ్యంతోనే అలా చేసినట్లు శ్రీనివాస్ చెబుతున్నాడు. ఇందులో కుట్ర లేదని, తన వెనక ఎవరూ లేరని చెప్పిందే చెబుతున్నాడు శ్రీనివాస్ మరి. ఇక విశాఖ ఎయిర్ పోర్ట్ లోని క్యాంటిన్ హర్షవర్దన్ తో పాటు శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడిన పది మంది మహిళల పాత్ర ఏంటి అన్న దానిపైనా ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.

దాడి జ‌రిగిన స‌మ‌యంలో అక్క‌డ ఉన్న వైసీపీ నేత‌లు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ NIA అధికారులు నోటీసులు పంపించారు. దీంతో YCP కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్, మాజీ కార్పొరేటర్‌ జియ్యాని శ్రీధర్‌ రెండు రోజులక్రితం విచారణ జరిగినది . ఇక నోటీసులందుకున్న మిగతా వైఎస్సార్‌సీపీ నేతలు కూడా రెండు రోజుల్లో విచారణకు హాజరవుతామని సమాదానం చెప్పారు. కానీ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని కి, TDP నేత‌ హర్షవర్దన్ చౌదరి NIAవిచారణకు హాజరు కాలేదని.. కనిపించడం లేదని.. కాంటాక్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుం.. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఫోన్ స్విఛ్ఆఫ్ వ‌స్తుంద‌ని తెలిపారు. దీంతో ఒకటి, రెండు రోజులు చూసి అప్పటికీ హర్షవర్ధన్‌ విచారణకు రాకుంటే ఏం చేయాలో నిర్ణయిస్తామని NIA అధికారులు తెలిపారు.