ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ప్లీజ్ – వైసిపి అథినేత జ‌గ‌న్‌

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

బీసీల బతుకుల్లో మార్పు తీసుకువ‌చ్చేందుకు త‌మ‌కు ఒక్క‌ అవ‌కాశం ఇవ్వాల‌ని వైసిపి అధినేత జ‌గ‌న్ కోరారు. ఏలూరులో వైసిపి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బీసీ గర్జన సభలో ఆయ‌న బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమానికి ఏటా 15 వేల కోట్లతో 5 ఏళ్ల‌లో రూ 75 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తామని స్ప‌ష్టం చేశారు. బీసీ స‌బ్ ప్లానుకు చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పిస్తామని హామీ ఇచ్చారు. బీసీలను కరివేపాకులా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని, ఇటువంటి వ్యక్తిని 2019 ఎన్నికల్లో ఓడించి, తమ పార్టీని గెలిపించాలని కోరారు.

తమను గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో మంచి పనులు చేస్తామని, ఆ మంచి పనుల గురించి చెప్పి 2024 ఎన్నికల్లో మళ్లీ మిమ్మల్ని ఓట్లు వేయమని అడుగుతామన్నారు జ‌గ‌న్‌. నవరత్నాలు అమల్లోకి రావాలంటే అందరీ చల్లని దీవెనలు తనకు కావాలని కోరారు ఆయ‌న .మొద‌టి బ‌డ్జెట్ లో స‌మ‌గ్ర బీసీ చ‌ట్టాన్ని తీసుకుని వస్తామన్నారు. మూడో వంతు నిధులు బీసీల‌కు కేటాయిస్తూ కార్పొరేష‌న్ల వ్య‌వ‌వ్థ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తామన్నారు.

అన్ని కులాల‌కు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేస్తామని, ర‌జ‌కులు, చేనేత, మ‌త్స్య‌కారులు, బోయ‌లు, వాల్మీకులు, అగ్రికుల‌ క్ష‌త్రియులు, శాలివాహ‌న, దూదేకుల, కొ్పుల వెల‌మ, శెట్టి బ‌లిజ‌, గాండ్ల, ముదిరాజ్, భ‌ట్రాజు వంటి బీసీ కులాల‌కు మొత్తం 139 కార్పొరేష‌న్లు ప్రారంభిస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచి అధికారంలోకి వస్తే కనుక నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మత్స్యకారులో కోసం.. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.

10 వేలు ఇస్తామని, ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా కింద ఇస్తామని, మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ పై సబ్సిడీ పెంచుతామని హామీ ఇచ్చారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత మహిళకు ప్రతి నెలా రూ.2 వేలు ఇస్తామని, పేదవాడు ప్రమాదవ శాత్తు చనిపోతే కనుక బీమా కింద రూ.7 లక్షలు అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బిసి నేత జంగా కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టు వైఎస్ జగన్ ప్రకటించారు.