ఎన్నిక‌ల శంఖారావం పూరించిన జ‌గ‌న్

Jaganmohan Reddy, Prakasham, Tirupathi, YSRCP,
YS Jagan Mohan Reddy

తిరుప‌తి వేదిక‌గా ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల స‌మ‌ర శంఖాన్ని పూరించారు ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైసిపి అధినేత జ‌గ‌న్.ప్ర‌త్యేక హోదా పై ఎవరు సంతకం పెడతారో వారికే తమ మద్దతిస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో మాదిరే వచ్చే ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తుపెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు వైసీపీ అధినేత జగన్. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయన్నారు ఆయ‌న‌.

ఆ పార్టీలకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. ఓటు వేయమని చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోమని, ఓటు మాత్రం మనస్సాక్షి చెప్పినట్టు వేయాలని వ్యాఖ్యానించారు ప్ర‌తిప‌క్ష‌నేత‌. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో, అలాగే, వైసీపీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు జగన్. తాము అధికారంలో వచ్చాక వృద్ధులకు నెలకు రూ. 3 వేల పెన్షన్‌ ఇస్తానని, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచుతానని, రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానిని జగన్‌ ప్రకటించారు.ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయని,ఈ రెండు నెలలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయ‌న కోరారు.

ప్రతి ఓటరు ఓటు వేసేలా బూత్ కమిటీలు బాధ్యత తీసుకోవాలని, చంద్రబాబు ప్రలోభాలకు లోనుకాకుండా చూడాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో అక్రమ మార్గాల ద్వారా గెలిచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని,రాష్ట్రంలో 59 లక్షల అక్రమ ఓట్లు వెంటనే తొలగించాలంటూ జగన్‌ డిమాండ్‌ చేశారు.