ప్రమాణ స్వీకారానికి చంద్రబాబుకు ఆహ్వానం

Jaganmohan Reddy, Prakasham, Tirupathi, YSRCP,
YS Jagan Mohan Reddy

మాజీ సీఎం చంద్రబాబుకి.. ఆంద్ర‌ప్ర‌దేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్ చేశారు. తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా చంద్రబాబును జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్దికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఐతే ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.