జాబు రావాలంటే బాబు పోవాలి – వైసిపి అధినేత జ‌గ‌న్

Jagan Chandrababu
Jagan Chandrababu

గ‌తంలో జాబు రావాలంటే బాబు రావాలని చెప్పారనీ, ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలని వ్యాఖ్యానించారు వైసీపీ అధినేత జగన్ . శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్ర‌సంగించారు. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడి పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు.

ప్రభుత్వ కాంట్రాక్టులను నిరుద్యోగులకే ఇస్తామని, ఆ కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పిస్తామన్నారు ఆయ‌న‌. ఏపీలో 1.7 కోట్ల ఇళ్లు ఉంటే, ఉద్యోగాలు లేని యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2,000 ఇస్తామని హామీ ఇచ్చారనీ, దాన్ని పట్టించుకోలేదన్నారు. ప్రజలందరి దీవెనలతో అధికారంలోకి రాగానే ఎన్ని లక్షలు ఖర్చయినా వెనకాడకుండా పిల్లలను చదవిస్తామనీ, ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. మన జీవితాలు బాగుపడాలంటే నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్లాలి అని జగన్ అభిప్రాయపడ్డారు.