అదంతా వైర‌ల్‌.. ఇదే రియ‌ల్ – కెమెడియ‌న్ ఆలీ

ali

త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై ఆలీ క్లారిటీ ఇచ్చేశారు. రాజ‌కీయ ఆగ‌మ‌నం అంతా సోషల్ మీడియా ప్రచారం మాత్రమేనని స్ప‌ష్టం చేశారు. గత కొంతకాలంగా వైసీపీలో చేరనున్నారని ప్రచారంపై స్పందించారు. విశాఖ విమానాశ్రయంలో ఒకే విమానంలో కలిసి పయనించడానికి ముందు మర్యాద పూర్వకంగానే జగన్ మోహన్ రెడ్డిని కలిశానన్న అలీ… అప్పుడు ఒక ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశారన్నారు.

ఆ తర్వాత కూడా వైసీపీ వర్గాలు కూడా తనను ఎన్నడూ సంప్రదించలేదన్నారు. కేవలం అది పుకార్లు మాత్రమేనన్నారు. పనిలేకున్నా పేరుపట్టి ఖండిస్తే అది ఆ పార్టీని అవమానించినట్లేనని అప్పటి నుండి ఖండించలేదన్నారు. అయితే తాను ఏ గ‌ట్టులో వుంటాడ‌నేది మాత్రం తేల్చ‌లేదు ఆలీ.