ఇస్మార్ట్ శంకర్ టీజర్ విడుదల…!

ismart shankar
ismart shankar

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌, నిధి అగర్వాల్‌, నభానటేష్‌ హీరో,హీరోఇన్లు గా తెరకెక్కు తున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఇటివలే ఈ చిత్రం టాకీపార్ట్‌ చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ నాలుగు పాటల చిత్రీ కరణ మాత్రమే మిగిలివుందని తెలిపారు. రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 15న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయను న్నట్లు తెలియజేసారు.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌, ఛార్మికౌర్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.