భానుప్రియ అరెస్టు తప్పదా?

BhabuPriya, Arrest, ChildrightsAct, Cash, Camera, Ipad, Achyuth rao,

తన ఇంట్లో పని చేసే అమ్మాయిని వేధించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి భానుప్రియని అరెస్టు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. భానుప్రియ పనిపిల్ల పేరు సంధ్య .వయసు 14 ఏళ్ళ. మైనర్ పట్ల భానుప్రియ కర్కశంగా వ్యవహరించిందని, బాలల హక్కుల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేయాలని కోరారు. ఈ సంఘం నేత అచ్యుత రావు ఏపీ డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు.

18 ఏళ్ళు నిండిన అమ్మాయిలనే యజమానులు పనిలో పెట్టుకోవాలన్న నిబంధన ఉందని ఆయన గుర్తు చేశారు భానుప్రియ కు. భానుప్రియ ఇంటినుంచి పనిపిల్ల సంధ్య లక్షన్నర నగదు, కెమెరా, ఐప్యాడ్, కొన్ని నగలు దొంగిలించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ సంధ్య తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై సామర్లకోట పోలీసు స్టేషన్ లో భానుప్రియపై కేసు నమోదైంది. కనీ తనపై వచ్చిన ఆరోపణలను భానుప్రియ కొట్టిపారేశారు.