ఇస్మార్ట్ శంకర్…నిజంగానే అంత స్మార్టా?

iSmartShankar
iSmartShankar

ఇస్మార్ట్ శంకర్…ఈ సినిమా స్టార్టింగ్ నుండి కూడా ఈ సినిమాపై ఫుల్ పాజిటివ్ బజ్ ఏర్పడింది.ఈసారి పూరి గురి తప్పదు…బ్లాక్ బస్టర్ అంటున్నారు.అందుకే ఈ సినిమాకోసం రామ్ రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడు అని టాక్ వినిపిస్తుంది.

అయితే పూరి తన రెగ్యులర్ స్టైల్ లో ఈ సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు.ఆల్మోస్ట్ టాకీ పార్ట్ పూర్తయిపోయింది.పాటలకి వెళ్లిపోయారు.అయితే ఈ సినిమా హీరో రామ్ కి,డైరెక్టర్ పూరి కే కాదు,మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకి కూడా చాలా ఇంపార్టెంట్.

అందుకే ఈ సినిమాకి సూపర్ గా ఉండే ట్యూన్స్ అందించాడట.వాటికి శేఖర్ మాస్టర్ అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేసాడట.ఇక డాన్స్ పరంగా మెరుపుతీగలా కదిలే రామ్ ఒక రేంజ్ లో రెచ్చిపోయి ఆ స్టెప్స్ వేసాడు అని చూసినవాళ్లు అంటున్నారు.అలాగే అందాలా నిధి అయిన నిధి అగర్వాల్ కి కూడా ఫస్ట్ రెండు సినిమాలతో విజయం దక్కలేదు.

అందుకే ఈ సినిమాకోసం ఇస్మార్ట్ గా తన సోకులన్నీ ధార పోస్తుంది అని అంటున్నారు.ఇక ఈ సినిమాతో హిట్ అందుకోకపోతే పూరి కనెక్ట్స్ కి కష్టాలు తప్పవు.అందుకే పూరి ఈ సినిమాని కసిగా రాసుకుని అంతే కసిగా షూట్ చేస్తున్నాడు.ఛార్మి కూడా ప్రొడ్యూసర్ గా తన రోల్ తాను పర్ఫెక్ట్ గా నిర్వహిస్తుంది.

సో,ఇంతమంది హిట్ కోసం హానెస్ట్ గా కష్టపడుతున్నారుకాబట్టి ఈ ఇస్మార్ట్ శంకర్ నిజంగానే స్మార్ట్ గా ఉంటాడేమో అనిపిస్తుంది.టీజర్,ట్రైలర్స్ తో సినిమాపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.