ఐరా టీజర్:నయనతార నటనే హైలైట్

Nayanatara

ఈ మధ్య వరుసగా హీరోయిన్స్ సెంట్రిక్ సినిమాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తుంది నయనతార.పూర్తిగా కాన్సెప్ట్ అండ్ నయనతార పెర్ఫార్మెన్స్ హైలైట్స్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాలు ఇక్కడ ఎలాంటి రిజల్ట్ అందుకున్నాకూడా తమిళ్ లో మాత్రం బ్లాక్ బస్టర్స్ గా నిలబడుతున్నాయి.కెరీర్ మొదట్లో గ్లామరస్ పాత్రలతో పేరుతెచ్చుకున్న నయనతార ఇప్పడు మాత్రం పూర్తిగా నటనకే ప్రాధాన్యం ఇస్తుంది.అదే కోవలో తాజాగా ఐరా అనే సినిమాలో నటించింది.

ఆ సినిమా అఫీషియాల్ టీజర్ రిలీజ్ అయ్యింది.ఐరా సినిమాలో డ్యూయల్ రోల్ పోషించింది నయన్.ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా.పాస్ట్ అండ్ ప్రెసెంట్ లైఫ్స్ ని సైమల్టేనియస్ గా చూపిస్తూ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చెయ్యడానికి ట్రై చేస్తున్నారు.ఈ సినిమాలో నయన్ ఒక డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించడం విశేషం.ఆడపిల్లలను తక్కువగా చూడొద్దు అనే సోషల్ మెసేజ్ ని వెరైటీ స్క్రీన్ ప్లే తో మిక్స్ చేసి చూపిస్తున్నారు.

ఈ ట్రైలర్ మొత్తానికి హైలైట్ అంటే నయనతార నటనే.సుందరమూర్తి అందించిన మలయాలే నేటివ్ ఆర్.ఆర్ కూడా టీజర్ ఇంపాక్ట్ ని పెంచింది.సర్జున్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.ఇప్పటివరకు నయనతార నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు తెలుగులో చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు.ఈ సినిమా అయినా ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.