శర్వానంద్ సినిమాకు ఇంటరెస్టింగ్ టైటిల్…!

Sharwanand
Sharwanand

తమిళంలో విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ‘96’. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో శర్వానంద్‌, సమంతలు హీరో,హీరోఇన్లు గా రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.నేటివిటికీ తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేసిన తర్వాత టైటిల్‌ కూడా అచ్చ తెలుగులో ఉండాలని భావించారట. ఆ మేరకు జానకీదేవి అనే టైటిల్‌ను ఈ తెలుగు రీమేక్‌కు పెట్టబోతున్నారని సమాచారం. ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్‌ మీదుకు వెళ్లనుంది.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.