ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు యథాతథం: అశోక్​

Ashok Kumar
Ashok Kumar

వరంగల్ లో ప్రశ్నపత్రాల గల్లంతు వ్యవహారంపై ఇంటర్​ బోర్డు కార్యదర్శి అశోక్​ స్పందించారు. విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని అశోక్ పేర్కొన్నారు. ఈనెల 7 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. వరంగల్ పోలీస్ స్టేషన్ లో భద్రపరిచిన రెండు పెట్టెల్లోని ప్రశ్నపత్రాలు గల్లంతయ్యాయని తెలిపారు. అయితే ఆ రెండు పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మరో సెట్ ప్రశ్నపత్రం పంపిస్తున్నామని అశోక్ వెల్లడించారు. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలులో ఎలాంటి మార్పు ఉండదని.. పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కార్యదర్శి పేర్కొన్నారు.