కేంద్ర బ‌డ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు మళ్లీ నిరాశే

telugu-states
telugu-states

ఈ కేంద్ర బడ్జెట్‌లో కూడా తెలుగు రాష్ట్రాలకు మళ్లీ నిరాశే ఎదురైంది. ముఖ్యమైన ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు కనిపించలేదు. ఏపీకి మరోసారి మోదీ తీవ్ర అన్యాయం చేశార‌నే వాద‌న‌లు వున్నాయి. తన బడ్జెజ్ ప్రసంగంలో ఎక్కడా విశాఖ రైల్వేజోన్‌‌ గురించి మాట్లాడ లేదు. అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీకి కూడా ఎలాంటి కేటాయింపులు జరపలేదు.

మ‌రోవైపు కేంద్రం మధ్యంతర బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యంతర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం స్పందించక పోవడం దారుణమన్నారు.