అభినందన్ కు అభినంద‌న‌ల వెల్లువ‌

Abhinandhan vardhaman
Abhinandhan vardhaman

పాక్ చెర నుంచి బయటపడి క్షేమంగా భారత్ చేరుకున్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు దేశం అపూర్వ స్వాగ‌తం ప‌లికింది. ఆసేతు హిమాచ‌లం జేజేలు పలికింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలూ అభినందన్ కు అభినందనలు తెలిపారు దేశం నిన్ను చూసి గర్విస్తున్నదని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

అసమాన ధైర్యసాహసాలకు జాతి మొత్తం ఫిదా అయ్యిందన్నారు. ఇక రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సహా పలువురు నేతలు అభినందన్ ధైర్యసాహసాలను ప్ర‌స్తావించారు. భార‌త‌ వీరుడుని చూసి జాతి యావ‌త్తూ గ‌ర్విస్తున్నదని వెల్ల‌డించారు.