అవకాశం వస్తే ఆ పార్టీలో చేరతా: షకీలా

Shakeela, Kamalhasan, Fan, Newparty, Makkal Needi Mayyam,

కమల్‌హాసన్‌కు తాను పెద్ద ఫ్యాన్‌ అని.. ఆయన సినిమాలను విడుదలైన రోజే చూస్తానని సినీ నటి షకీలా చెప్పారు. కమల్‌హాసన్‌ ఆహ్వానిస్తే ఆయన పార్టీ మక్కల్‌ నీది మయ్యంలో చేరతానని తెలిపారు .కమల్‌హాసన్‌ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. ఆమె.. తన అభిమాన హీరో పొలిటీషియన్‌గా మారడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు. కమల్‌ అవకాశం ఇస్తే ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటానని తెలిపారు. కమల్‌పైన అభిమానాన్ని గతంలోనూ షకీలా చాటుకున్నారు తెలిసిందే. మరో జన్మంటూ ఉంటే కమల్‌ సోదరిగా పుట్టాలనుందని తెలిపారు.