నా భార్యను తిడితే సహించలేను !

BigBoss Show, Mumbai, Srikanth, Deepika, Bhuvaneswari, SocialMedia,

బిగ్‌బాస్‌ సీజన్‌ 12 విజేత దీపిక కక్కర్‌పై.. క్రికెటర్‌ శ్రీశాంత్‌ ముంబయి లో ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశాంత్‌, దీపిక లు బిగ్‌బాస్‌ షోలో పాల్గొని ఇద్దరూ మద్దతుగా ఉన్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 12 లో దీపిక విజేతగా, శ్రీశాంత్‌ రన్నరప్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో దీపిక అభిమానులు సోషల్‌మీడియాలో శ్రీశాంత్‌పై అతని భార్య భువనేశ్వరిపై అసభ్యకర కామెంట్లు చేసారు. దాంతో శ్రీశాంత్‌కు కోపం తో వచ్చి తాను చెల్లెలిగా భావించే దీపికను సోషల్‌మీడియాలో అన్‌ఫాలో చేసారు.

దేని పై శ్రీశాంత్‌ను ప్రశ్నించగా దీపికను నేను అన్‌ఫాలో అయ్యా. ఎందుకంటే ఆమె నా భార్యను అన్‌ఫాలో అయ్యా. నా భార్యకు మర్యాద ఇవ్వనివారికి నేను మర్యాద ఇవ్వ. నా భార్యే నాకు శక్తి. దీపిక అభిమానులు నన్ను, నా భార్యను నోటికొచ్చినట్లు అన్నారు. ఎవరైనా నా బార్య ను తిడితే నేను సహించలేను సహించలేను అన్నారు. అలా తిట్టకూడదని దీపిక వారికి కనీసం ఒక్కమాటైనా చెప్పలేదు. నా అభిమానులు దీపికను తిదితే నేను వారిని హెచ్చరించా. ఇక పై ఈ విషయం గురించి నేను దీపికతో చర్చించాలనుకోవడంలేదు. నా తప్పు లేదని తెలియజేయడానికి మాత్రమె నేను మీడియా ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టాను అని వెల్లడించారు శ్రీశాంత్‌