చిన్న అమ్మాయి బాలీవుడ్‌లో అగ్ర కథానాయిక ఎలా ?

Kangana Ranaut, Bollywood, Director,
Kangana Ranaut

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ తన బయోపిక్‌కు తానే మాత్రమే దర్శకత్వం వహిస్తానని అంటుది కంగనా రనౌత్ . ఈ విషయం పై ఆమె ఓ బాలీవుడ్‌ మీడియా ద్వారా తెలిపారు. అవును. నా బయోపిక్‌ను నేనే తీస్తా. నిజాయతీగా, నా జీవితం ఎలా ఉండేదో. అప్పుడు. ఇప్పుడు ఎలా ఉందో తెరకెక్కిస్తాను. నన్ను జడ్జ్‌ చేయకుండా, నన్ను నాలా స్వీకరించి ప్రేమించే వారు నా చుట్టూ ఉన్నారు. వారి కోసమైనా సినిమా తీయాలని అంది

 

కొన్ని వారాల క్రితం ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ నా జీవితంపై పలు విసయాల పై పుస్తకం రాస్తానని అన్నారు. తొలుత నేను కంగారు అయ్యా . కానీ ఆయన గొప్ప రచయిత తో పాటు నిజాయతీగా రాస్తారన్న నమ్మకం ఉంది. అందుకే ఓకే అన్న. కనుక నా బయోపిక్‌కు విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తారు. నా జీవితంలో నాకు సాయం చేసినవారి దగ్గర్నుంచి అవమానించిన వారి వరకు అన్ని విషయాలు బయోపిక్‌లో ప్రస్తావిస్తా. అయితే ఎవ్వరి పేరును బయటపెట్టను అని అంది. అలాంటివారి నుంచి నన్ను, నా జీవితాన్ని కాపాడుకోవాలి. మొత్తానికి సినీరంగంతో ఏమి సంబంధం లేని ఓ చిన్న ప్రాంతానికి చెందిన అమ్మాయి బాలీవుడ్‌లో ఎలా అగ్ర కథానాయికగా ఎదిగింది అన్న కాన్సెప్ట్పై నా బయోపిక్‌ ఉండబోతోంది అని వెల్లడించారు కంగనరనౌత్.