ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌సంగించిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్

Ekkadu Srinivasan Lakshmi Narasimhan is the Governor of the Indian states of Andhra Pradesh and Telangana.
Ekkadu Srinivasan Lakshmi Narasimhan is the Governor of the Indian states of Andhra Pradesh and Telangana.

తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో ముందంజలో ఉందన్నారు గవర్నర్‌ నరసింహన్ . కళ్యాణ లక్ష్మి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ కొరతను అధిగమించిందని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.

రాబోయే కాలంలో లక్షా 17 వేల కోట్ల రూపాయిల విలువైన పనులను చేపడతామని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. గత నాలుగున్నరేళ్లలో నీటి పారుదలకు 77 వేల 777 కోట్లు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన కాకతీయ మిషన్‌ సత్ఫలితాలనిచ్చిందని ఆయన అన్నారు.