కోడిక‌త్తి కేసులో ఏపి స‌ర్కారుకు మ‌రో ఎదురు దెబ్బ

Jagan-Attack
Jagan-Attack

విశాఖ ఎయిర్ పోర్టులో YCP అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.NIA దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.ఈ కేసులో 30వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

అలాగే దర్యాప్తు ఫైళ్లను కోర్టు ముందు ఉంచాలని జాతీయ దర్యాప్తు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.కోడికత్తి కేసును NIA కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.