ఇస్మార్ట్ శంకర్ కోసం పూరి కొత్త ఫార్ములా

Nidhi AgarwalNidhi Agarwal
Nidhi Agarwal

ఎవరయినా డైరెక్టర్ సినిమా స్టార్ట్ చేస్తుంటే తన టీమ్ లో ఎక్కువ లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళని,స్సక్సెస్ చార్మ్ అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు.ఇక ఆ సినిమాకి తామే ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారు.కానీ డాషింగ్ డైరెక్టర్ పూరి మాత్రం వేరు.ఆయన దారి వేరు.తన సినిమాల్లో హీరోల్లా రెక్లెస్ గా ఉంటాడు.ఫార్ములాలని,సెంటిమెంట్స్ ని పట్టించుకోడు.మధ్యలో మెహబూబా సినిమాకోసం కాస్త తన దారి మార్చుకున్న పూరి ఆ సినిమా ఫలితం తేడా కొట్టడంతో మళ్ళీ పాత రూట్ లోకి వచ్చేసాడు.

రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీస్తున్నాడు.కానీ ఆ సినిమా టీమ్ లో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న వాళ్ళు,హిట్ కొట్టిన వాళ్ళు ఒక్కరూ లేకపోవడం విశేషం.ఆ సినిమాలో హీరో రామ్…నేను శైలజ తరువాత మళ్ళీ ఇంతవరకు అతని స్థాయి హిట్ లేదు.ఇక ఈ సినిమ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ….ఆయన్ని ఆల్మోస్ట్ మర్చిపోయే పరిస్థితి వచ్చింది.ఇక పూరి సంగతి సరే సరి.గత రెండు సినిమాలు పూరి ఫామ్ ఎలా ఉందో బూతద్దంలో చూపించాయి.ఇక ఇప్పడు సినిమాకు మెయిన్ అట్రాక్షన్ అయిన హీరోయిన్స్ విషయంలో కూడా పూరి ఈ దారినే ఫాలో అవుతున్నాడు.

ఇప్పటివరకు నికార్సయిన హిట్ లేని నిధి అగర్వాల్ ని,ఫేస్ కూడా పెద్దగా పరిచయం లేని నభా నటేష్ ని హీరోయిన్స్ గా తీసుకున్నాడు.ఇలా అంతా ఫ్లాప్ బాచ్ ని పెట్టుకుని కసిగా పనిచేసి హిట్ కొట్టాలి అనేది పూరి ఆలోచనగా తెలుస్తుంది.నిజానికి అలాంటి టైం లోనే బిగ్గెస్ట్ హిట్స్ కూడా అందుకున్నాడు పూరి.కానీ ఇలా టోటల్ కాస్ట్ అండ్ క్రూ వీక్ గా ఉంటే సినిమా అసలు మార్కెటింగ్ అవుతుందా లేదా అనే విషయం మర్చిపోయాడా? అని ట్రేడ్ కామెంట్స్.డు ఆర్ డై సిట్యుయేషన్ లో ఉన్న పూరి మాత్రం తనని తాను నమ్మకుని హిట్ కొట్టాలి అనే కసితో వర్క్ చేస్తున్నాడు.