భారీ సినిమాలు లైన్ లో పెట్టిన భల్లాలదేవుడు

rana-daggubati
rana-daggubati

బాహుబలి అనే సినిమా తెలుగు ఇండస్ట్రీని అన్ని విధాలుగా గ్రేట్ హైట్స్ కి చేర్చిన సినిమా.దాంట్లో వేరే వాదనలకు తావు లేదు.అయితే ఆ సినిమాలో నటించిన నటీనటులకు కూడా తిరుగులేని ఇమేజ్ వచ్చింది.ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ పేరు అనేక దేశాల్లో మార్మోగింది.ఆ ఇమేజ్ వల్ల ప్రస్తుతం ప్రభాస్ సినిమా బడ్జెట్ అంటే 200 కోట్లకు పైమాటే అనే టాక్ వినిపిస్తుంది.అయితే ఈ సినిమాలో ప్రతినాయక పాత్రను పోషించిన రానా పాపులారిటీ కూడా అమాంతం పెరిగింది.అందుకే రానా కూడా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలకే మొగ్గుచూపుతున్నాడు.

బాహుబలి సినిమాలో భల్లలాదేవుడికి కూడా భారీగా అభిమానులు ఏర్పడ్డారు.జపాన్ లో అయితే అభిమానులంతా కలిసి ఏకంగా ఒక స్పెషల్ ప్రీమియర్ కూడా వేయించుకున్నారు.అందుకే రానా తన తదుపరి సినిమాలను కూడా చాలా లార్జ్ స్కేల్ లో ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇప్పటికే ఘాజి లాంటి సినిమా చేసే నేషనల్ లెవెల్ లో సోలో హిట్ అందుకున్న రానా తన తదుపరి సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

రుద్రమదేవి డైరెక్టర్ గుణేశేఖర్ డైరెక్ట్ చేస్తున్న హిరణ్యకశిప సినిమాని ఏకంగా 180 కోట్ల బడ్జెట్ తో గుణశేఖర్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.బాహుబలి మార్కెట్ వల్లే రానా తో ఈస్థాయి రిస్క్ కి రెడీ అయ్యారు.అయితే రానా నటిస్తున్న మరో సినిమా విరాటపర్వం కూడా కాస్త భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమాని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో అన్నిటిలో రిలీజ్ చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ కాబట్టి ఆమె క్రేజ్ కూడా కలిసొస్తుంది.బాహుబలి లో హీరో క్యారెక్టర్ వేసిన ప్రభాస్ తో ఆల్మోస్ట్ ఈక్వల్ క్రేజ్ రానా కి కూడా దక్కింది. అందుకే దాన్ని నిలబెట్టుకుంటూ హీరో అనిపించుకోవడానికి ప్రభాస్ లానే రిస్క్ చేస్తున్నాడు రానా.రానా కూడా ఈ దారిలో సక్సెస్ అయితే ఇదే తరహా రిస్క్ చేసి తమ మార్కెట్ పెంచుకోవడానికి మరికొంతమంది హీరోలు ముందుకు వస్తారు అనే విషయంలో మాత్రం ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.