జ‌గ‌న్‌ని హీరో నాగార్జున ఎందుకు క‌లిసారో తెలుసా..!

jagan nagarjuna
jagan nagarjuna

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో వైసీపీ అధినేత జగన్ ని సినీ హీరో నాగార్జున కలవడంపై పలు ఊహాగానాలు ప్ర‌చార‌మ‌య్యాయి. వైసీపీలో నాగార్జున చేరతారని, వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసేందుకు టికెట్ అడిగేందుకు వెళ్లారని… పలు పుకార్లు షికార్లు చేశాయి.

జగన్ తో నాగార్జున భేటీ సుమారు అరగంట సాగింది. సమావేశం ముగిసిన అనంతరం జగన్ నివాసం నుంచి బయటకు వచ్చిన నాగార్జున మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోవడంతో ఈ ఊహాగానాలు మరింత పుంజుకున్నాయి . అయితే ఈ నేపథ్యంలో నాగార్జున స్పందిస్తూ జగన్ తమ కుటుంబానికి సన్నిహితుడని, ఇటీవల పాదయాత్ర పూర్తి చేసిన జగన్ ని కలిసి అభినందించేందుకు ఆయన నివాసానికి వెళ్లానని క్లారిటి ఇచ్చారు. త‌మ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు నాగార్జున‌. రాజకీయాలపై తనకు ప్రత్యేక ఆసక్తి లేదని స్ప‌ష్టం చేశారు.