గోపిచంద్‌ కు గాయాలు..

Gopichand
Gopichand

కెరీర్ మొదటి నుండి కూడా యాక్షన్ బేస్డ్ ఎంటెర్టైనెర్స్ సినిమాలే చేస్తూ,వాటితోనే మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నారు గోపిచంద్.అందుకే ఇప్పడు తన 26 వ సినిమాను కూడా తమిళ్ డైరెక్టర్ తిరు తో కలిసి చేస్తున్నాడు.ఈ సినిమాకి కీలకమయిన ఫైట్ సీక్వెన్సెస్ ని రాజస్థాన్ దగ్గర మండవ లో షూట్ చేస్తున్నారు.అయితే అక్కడి షూటింగ్ లో బైక్ ఛేజ్ సీన్ ఒకటి షూట్ చేస్తుండగా గోపిచంద్ బైక్ స్కిడ్ అయ్యి కిందపడ్డాడట.

అయితే గోపీచంద్ కి కొంచెం గాయాలయ్యాయని అని సమాచారం.కానీ ట్రీట్మెంట్ అనంతరం మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి ఆ షెడ్యూల్ ఫినిష్ చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నారట.ఈ యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తుంటే సినిమాలో అనేక రిస్కీ స్టoట్స్ ఉన్నాయి అని యూనిట్ చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది.మరి ఇంత కష్టపడి చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.ఈ యాక్షన్ బేస్డ్ సినిమాని అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.