సాహో ఛాఫ్టర్-2 రెస్పాన్స్

Saaho – Shades Of Saaho – Chapter 2

సాహో…దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.దానికి తగ్గట్టుగానే షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో రిలీజ్ చేసిన చాప్టర్-1 కి భారీ అప్లాజ్ వచ్చింది.అయితే ఆ సినిమా హీరోయిన్ శ్రద్దా కపూర్ బర్త్ డే సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో నుండి చాప్టర్ 2 ని రిలీజ్ చేసారు.

అయితే ఈ వీడియోలో కూడా సినిమా గ్రాండియర్ నే చూపించే ప్రయత్నం చేసారు.అలాగే ఈ సినిమాలో యాక్షన్ స్కెలింగ్ లో ఒక ప్రిమైజ్ లా దీన్ని కట్ చేసారు.షేడ్స్ ఆఫ్ సాహో కూడా పాజిటివ్ అప్లాజ్ దక్కించుకుంది.కాకపోతే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు మోతాదు మించిపోతాయా అనే ఒక చిన్న డౌట్ అయితే క్రియేట్ అవ్వడం ఖాయం.చాప్టర్ -1 లో దుబాయ్ లో షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ చూపిస్తే ఈసారి మాత్రం ఇండోర్ యాక్షన్ సీక్వెన్సెస్,అలాగే ఈ సినిమాలో వాడే గన్స్ మోడల్స్ అన్నీ ఎలివేట్ అయ్యేలా చాప్టర్-2 ని రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ సైతం భారీ యాక్షన్ సీన్స్ చేస్తూ షాకిచ్చింది.గతంలో ప్రభాస్ బిల్లా కూడా హోమ్ ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో అల్ట్రా స్టైలిష్ గా తెరకెక్కింది.ఆ సినిమా హీరోయిన్ అనుష్క కూడా రోప్ సీన్స్ లాంటివి చేసింది.డార్లింగ్ అభిమానులను ఈ కంపారిజన్ కలవరపాటుకు గురి చేస్తుంది.ఛాఫ్టర్-2 చూసాక ఇండిపెండెన్స్ డే కి ప్రేక్షకులముందుకు వస్తున్న సాహో సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.ట్రేడ్ లో అయితే ప్రభాస్ మరో సారి బాక్స్ ఆఫీస్ దగ్గ్గర బాహుబలి తరహా ఫీట్ రిపీట్ చేస్తాడు అనే మాట బాగా వినిపిస్తుంది.

షేడ్స్ ఆఫ్ సాహో – చాప్టర్ 2