చంద్రబాబు ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు…!

AP CM Chandra Babu Naidu
AP CM Chandra Babu Naidu

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,అయన కుమారుడు మాజీ మంత్రి లోకేష్‌ ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లించారు. చివరకుకొద్ది గంటలు ఆలస్యంగా వారు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. గురువారం రాత్రి 7 గంటల 20 నిమిషాలకు ఎయిర్‌ ఇండియా విమానం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌ బయల్దేరింది. ఇందులో చంద్రబాబు, లోకేశ్‌తో పాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం హైదరాబాద్‌ మీదుగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో.. విమానాన్ని హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు దారి మళ్లించారు. రాత్రి 9గంటల 20 నిమిషాలకు బెంగళూరులో విమానం సేఫ్‌గా ల్యాండైంది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు ప్రయాణికులు కొంతసేపు అక్కడే వేచి ఉన్నారు. వాతావరణం అనుకూలించడంతో రాత్రి 10 :30 గంటలకు బెంగళూరు నుంచి తిరిగి బయల్దేరి అర్ధరాత్రి ఒంటిగంటకు విమానం హైదరాబాద్ చేరుకుంది.