బంగ్లా కిరీటం హ‌సీనాకే ..!

Sheikh Hasina

బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్‌ హసీనా నాలుగోసారి పగ్గాలు చేపట్టారు.పార్లమెంట్ సార్వ‌త్రిక ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్‌ భారీ మెజారిటీ సాధించింది. 299 స్థానాలకు పోలింగ్‌ జరగగా..అధికార అవామీలీగ్‌ 288 స్థానాల్లో విజయ ఢంఖా మోగించింది.ఈ మేరకు బంగ్లా ఎలక్షన్‌ కమిషన్‌ సెక్రటరీ ఉద్దీన్‌ ఆహ్మద్‌ ప్రకటించారు.ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నెషనలిస్ట్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది.గోపాల్‌ గంజ్‌ నియోజకవర్గంలో ప్రధాని హసీనా..బీఎన్‌పీ అభ్యర్థి పై రికార్డు మెజారిటీతో గెలుపొందారు.

హసీనాకు 2 లక్షల పైచిలుకు ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థికి కేవలం 123 ఓట్లే దక్కాయి.బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన హసీనాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆమెకు పలుదేశాల అధినేతలు అభినందనలు తెలుపుతున్నారు.