బన్నీని ఢీ కొడుతున్న హీరోయిన్

Allu Arjun-Hansika
Allu Arjun-Hansika

ఎలాగయినా హిట్ అందుకోవాలి అని ఫిక్స్ అయిన అల్లు అర్జున్ తనకు రెండు హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ని నమ్ముకుని తన 19 వ సినిమా స్టార్ట్ చేసాడు.ఉగాదికి ముహూర్తం జరుపుకున్న ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ కి వెళ్ళింది.అల్లు అర్జున్ కూడా కాస్త బరువు తగ్గి,జుట్టు పెంచి కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.అయితే ఈ సినిమా కోసం కాస్త కొత్తగా ఆలోచించిన త్రివిక్రమ్ బన్నీని ఢీ కొట్టడానికి కండలు తరిగిన మేల్ విలన్ కి బదులు బుడ్డి బలం ఉపయోగించే హీరోయిన్ పాత్రని రాసుకున్నాడు.పైగా ఆ పాత్రకి గతంలో బన్నీ దేశముదురు సినిమాలో హీరోయిన్ గా నటించిన హన్సిక ని తీసుకోవడం షాకింగ్ గా మారింది.అప్పట్లో మొదటి సినిమాలోనే సన్యాసినిగా నటించిన హన్సిక టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది.

అప్పట్లో ఆమె తీసుకున్న డేరింగ్ డెసిషన్ గురించి అంతా మాట్లాడుకున్నారు.ఇక ఇప్పడు తమిళ్ లో టాప్ హీరోయిన్ లీగ్ లో కొనసాగుతున్న హన్సిక బన్నీ కి ఎదురు నిలిచే విలన్ గా కనిపించడం కూడా మరో సాహసోపేతమయిన నిర్ణయం అనే చెప్పుకోవాలి.అయితే ఈ ఒక్క లీక్ తో అలకనంద అని అంతా పిలిస్తున్న బన్నీ సినిమాకి కావాల్సినంత బజ్ వచ్చేసింది.ఈ సినిమాలో పూజ హెగ్డే కాకుండా మరొక హీరోయిన్ కూడా నటిస్తుంది అని తెలుసు గానీ ఆమెది నెగెటివ్ రోల్ అని ఎవరూ గెస్ చెయ్యలేకపోయారు.అరవింద సమేత లో తన యాక్షన్ యాంగిల్ చూపించి హిట్ కొట్టిన గురూజీ ఈ సారి ఎలాంటి సినిమాతో రాబోతున్నాడు అనే ఉత్కంఠ ఇప్పడు తారాస్థాయికి చేరింది.