హిట్ కోసం సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న గురూజీ

Trivikram
Trivikram

త్రివిక్రమ్ ఎంతమంచి రైటరో అంతమంచి డైరెక్టర్ కూడా అని అతని సినిమాల ద్వారా ప్రూవ్ అయ్యింది.అత్తారింటికి దారేది లాంటి కమర్షియల్ కమ్ డిగ్నిఫైడ్ హిట్స్ అతన్ని స్టార్ డైరెక్టర్ గా నిలిబెట్టాయి.కానీ అజ్ఞాతవాసి మాత్రం త్రివిక్రమ్ కి పిడుగుపాటు లాంటి ఫలితం ఇచ్చింది.ఆ రిజక్ట్ దెబ్బకి ఎప్పుడూ 24 క్రాఫ్ట్స్ లో కూడా తన మాటే నెగ్గించుకునే గురూజీ మొదటి చేతినుండి మొదటిసారిగా ఆ పగ్గాలు జారాయి.

హీరోయిన్,మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు స్క్రిప్ట్ విషయంలో కూడా ఎన్టీఆర్ జోక్యం కనిపించింది.అదే ఫైనల్ అయ్యింది కూడా.అన్ని రకాలుగా త్రివిక్రమ్ తగ్గి చేసిన అరవింద సమేత కమర్షియల్ గా ఎలాంటి విజయం అందుకున్నా కూడా ప్రేక్షకుల మైండ్ లో మాత్రం ఆ సినిమా హిట్.దాంతో ఇప్పడు బన్నీ తో చేసే సినిమాకోసం మళ్ళీ తన పాత అలవాటునే రిపీట్ చేస్తున్నాడు గురూజీ.

ముందు ఈ సినిమా హీరోయిన్ గా ఫ్రెష్ కాంబో అన్నట్టుగా కియారా అద్వానీ,రష్మిక మందన్నా లను రికమండ్ చేసాడు బన్నీ.అప్పటికి ఓకే అన్న త్రివిక్రమ్ స్క్రిప్ట్ పూర్తయ్యాక మాత్రం పూజా హెగ్డే ని ఫైనల్ చేసాడు.రెమ్యునరేషన్ కూడా కోటిన్నర పైమాటే.జనరల్ గా ఒకసారి చేసిన హీరోయిన్ ని రిపీట్ చెయ్యడం బన్నీ కి ఇష్టం ఉండదు.కానీ ఇక్కడ త్రివిక్రమ్ కోసం ఓకే అనాల్సి వచ్చింది.

మ్యూజిక్ డైరెక్టర్ విషయం వచ్చేసరికి బన్నీ నోటినుండి ముందు వినిపించే పేరు దేవిశ్రీప్రసాద్.ఇక్కడ కూడా అదే ప్రపోసల్ వచ్చింది.కానీ ఎందుకో గత కొంతకాలంగా దేవి కి దూరంగా ఉంటూ వస్తున్న త్రివిక్రమ్ మాత్రం మళ్ళీ థమన్ కే ఛాన్స్ ఇచ్చాడు.దీంతో రేస్ గుర్రం,సరైనోడు తరువాత బన్నీ తో హ్యాట్రిక్ మూవీ కి సిద్దమయ్యాడు తమన్.

ఇక తన మాట నెగ్గాలి,సినిమా తాను అనుకున్నట్టుగా తియ్యాలి అనే ఆలోచనతోనే ఈ సినిమా నిర్మాణంలో గీత ఆర్ట్స్ తో పాటు హారిక,హాసిని సంస్థని కూడా భాగస్వామిగా చేసినట్టు తెలుస్తుంది.స్క్రిప్ట్ కూడా త్రివిక్రమ్ అనుకున్నటుగానే రాసుకుని ప్రొడ్యూసర్ కి,హీరోకి నెర్రెషన్ ఇచ్చాడు.అరవింద సమేత హిట్ కి ఏవైతే కలిసొచ్చాయి అని ఫీల్ అవుతున్నాడో వాటినే ఈ సినిమా కి అడాప్ట్ చేసుకుంటున్నాడు.కాకపోతే ఈ సినిమాలో మాత్రం ఎంటర్టైన్మెంట్ ని మాత్రం బాగా పెంచుతున్నాడు అని టాక్ వినిపిస్తుంది.