అమ‌ల్లోకి వ‌చ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు …

Gujarat
Gujarat

గజరాత్‌లో ఇవాళ్టి నుంచి అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన రాజ్యాంగ సవరణపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. దీనితో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. నేటి నుంచి ప్రభుత్వోద్యోగాలు, విద్యాసంస్థల్లో జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ రిజ‌ర్వేష‌న్‌ల‌ను అమ‌లు చేస్తున్న తొలి రాష్ట్రం గా గుజ‌రాత్ నిలిచింది.