ఉగ్ర‌వాదంపై స‌మిష్టి పోరుకు అఖిల‌ప‌క్షం నిర్ణ‌యం

CRPF Jawans
CRPF Jawans

భారత దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే చర్యలను అనమతించేది లేదని అఖిలపక్షం స్ప‌ష్టం చేసింది. ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టాల్సిందేనని నిర్ణయించింది. పార్లమెంట్‌ లైబ్రరీ హాల్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ ఉగ్రదాడిపై తీసుకోబోయే చర్యలను రాజ్‌నాథ్‌ సింగ్‌ అఖిలపక్ష నేతలకు వివరించారు.

ఉగ్రవాదంపై పోరును సమష్టిగా ఎదుర్కొంటామంటూ తీర్మానం చేశారు.అనంత‌రం సీనియ‌ర్ నేత గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. పుల్వామా ఉగ్రదాడిపై చర్చించేందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి సూచించాల్సిందిగా హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు విపక్షాలు సూచించాయన్నారు.

ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందన్నారు.ఈ సమావేశంలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు ఆనంద్ శ‌ర్మ, కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నేరంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నారు.