కొత్త దర్శకుడు తో హీరో గోపీచంద్ సినిమా…!

Gopichand
Gopichand

నూతన దర్శకుడు బిను సుబ్రమణ్యం దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ఒక చిత్రం చేయనున్నారు.ఈ చిత్రాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ఫై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించనున్నారు. అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సతీష్.కె సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఈ సందర్భంగా. నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ మాట్లాడుతూ- “సాహసం తర్వాత గోపీచంద్‌తో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. దర్శకుడు బిను సుబ్రమణ్యం చెప్పిన కథ చాలా బావుంది. సాహసం ట్రెజర్ హంటింగ్ పాయింట్ మీద ఎంత అడ్వెంచరస్‌గా ఉంటుందో.. ఈసినిమా దాన్ని మించి ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. అన్ కాంప్రమైజ్‌డ్‌గా సినిమాను నిర్మిస్తాం. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం” అన్నారు.