గోపిచంద్ సరసన మిల్కి బ్యూటీ…!

Tamannaah Bhatia
Tamannaah Bhatia

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపిచంద్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇండియా, పాకిస్ధాన్ బోర్డర్ లో గల జైసల్మేర్ వద్ద జరగుతుంది. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ సినిమాను ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు చిత్రబృందం. అయితే తాజాగా ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.తమన్నా గోపిచంద్ ఇద్దరూ కలిసి నటించడం ఇదే తొలిసారి. సమ్మర్ లో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం.