మళ్ళీ యాక్షన్ బాటలో గోపీచంద్

Gopichand Thiru and AK officiial production no 18 shooting started
Gopichand Thiru and AK officiial production no 18 shooting started

గోపీచంద్ హీరోలుగా నిలదోక్కుకోవడానికి,తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకోవడానికి కారణం గోపీచంద్ చేసిన యాక్షన్ మూవీస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే అప్పట్లో సూపర్ హిట్స్ గా నిల్చిన యాక్షన్ మూవీస్ జోనర్ కి ఇప్పుడు మాత్రం పెద్దగా ఆదరణ దక్కడంలేదు.ప్రేక్షకుల టేస్ట్ మారడంతో రొటీన్ అనే బ్రాండ్ వేసి వాటిని రిజెక్ట్ చేస్తున్నారు.

కానీ గోపీచంద్ మాత్రం యాక్షన్ సినిమాలను వదిలి పక్కకు రాలేకపోతున్నారు.తన 25 వ సినిమాకూడా యాక్షన్ ఎంటెర్టైనరే.కానీ అది రిలీజ్ అయిన టైం వల్ల పెద్దగా లాభాలు అందిచలేకపోయినా నష్టాలు రాకుండా కాపాడగలిగింది.దాంతో మళ్ళీ మరొక స్టైలిష్ ఎంటర్టైనర్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.తమిళ్ డైరెక్టర్ తిరు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమాని మొదలుపెట్టడమే ఒక పెద్ద యాక్షన్ సెంవెన్స్ తో స్టార్ట్ చేసారు.జైసల్మేర్ లోని ఇండోపాక్ బోర్డర్ లో ఆ సీక్వెన్స్ ని స్టార్ట్ చేశారు.వరుసగా మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ తన దూకుడు పెంచిన AK ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాకి మాత్రం భారీ బడ్జెట్ కేటాయించింది.50 రోజుల పాటు నార్త్ ఇండియా లో జరిగే నాన్-స్టాప్ భారీ షెడ్యూల్ తో ఈ సినిమాలో మేజర్ పార్ట్ పూర్తవుతుంది.ఈ సమ్మర్ లోనే సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. లౌక్యం తరువాత చెప్పుకోదగ్గ హిట్ లేక ఇబ్బందిపడుతున్న గోపీచంద్ కి ఈ సినిమా అయిన ఆశించిన హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.