బాలకృష్ణ సినిమా టైటిల్ తో వస్తున్న గోపిచంద్…!

Gopichand Thiru and AK officiial production no 18 shooting started
Gopichand Thiru and AK officiial production no 18 shooting started

తిరు దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మెహరీన్ కౌర్, జరీనాఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల ఇండో పాక్ బార్డర్ లో షూటింగ్ జరుపుకుంటుండగా హీరో గోపిచంద్ కు గాయమవడంతో కొన్ని రోజులు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. ఇక గోపిచంద్ కు గాయం మానడంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ మరో రెండు రోజుల్లో హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే యాభైశాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించుకోనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గతంలో బాలయ్య నటించిన హిట్ చిత్రం `బంగారు బుల్లోడు` అనే టైటిల్ ని గోపిచంద్ సినిమాకు ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతోంది.